సిబిఐపై రాజకీయ ఒత్తిళ్లపై సుప్రీం స్పందన, అక్షింతలు

Supreme Court
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)పై రాజకీయ ఒత్తిళ్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం స్పందించింది. బొగ్గు కుంభకోణంపై సుప్రీం కోర్టులో ఉదయం విచారణ ప్రారంభమైంది. బొగ్గు కుంభకోణంపై సిబిఐ అఫిడవిట్ గందరగోళంగా ఉందని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వానికి నివేదిక వివరాలు తెలపడంతో దర్యాఫ్తు ప్రక్రియ బలహీనమైనదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాఫ్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పినట్లుగా కోర్టుకు ఎందుకు తెలుపలేదని సుప్రీం కోర్టు సిబిఐని ప్రశ్నించింది. నివేదిక వివరాలు బయటపడటంపై కేంద్రంతో పాటు సిబిఐకి అక్షింతలు వేసింది.

సిబిఐకి స్వయంప్రతిపత్తిని కల్పిస్తామని చెప్పారు. రాజకీయ జోక్యం నుండి సిబిఐకి విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. సిబిఐకి స్వయంప్రతిపత్తి పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. వివరాలు ప్రభుత్వానికి తెలపడం మామూలు విషయం కాదని అభిప్రాయపడింది.

సిబిఐపై రాజకీయ ప్రభావం పడకుండా చేయడమే తమ ప్రథమ సంకల్పమన్నారు. సిబిఐ రాజకీయ నేతల సూచనలను తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు పార్లమెంటులో ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. బొగ్గు కుంభకోణం, 2జి అంశాలపై నిరసన చేపట్టి నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+