ఐతే మళ్లీ వెన్నుపోటు తప్పదు: బాబుకు బొత్స చురక

చంద్రబాబు మళ్లీ వెన్నుపోటుకు సిద్ధమయ్యారనే అర్థం చేసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన రూ.2 కిలో బియ్యాన్ని రద్దు చేసింది, మద్యపాన నిషేదాన్ని ఎత్తి వేసింది చంద్రబాబే అన్నారు. బాబు ఎప్పుడు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదన్నారు. 1999లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఓడిన కారణంగా ఆ సానుభూతితో బాబు రాష్ట్రంలో గెలిచారన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకోవడంతోనే బాబు అప్పుడు అధికారంలోకి వచ్చారన్నారు. విద్యుత్ వంటి అంశాలకు గండి కొట్టారన్నారు. చంద్రబాబు మారిన మనిషినంటూ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బంగారు తల్లి పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని చెప్పారు.
బంగారు తల్లి పథకం గురించి తనకు తెలియదని, తెలిస్తే మాట్లాడుతానన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రానందుకే తాను మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు రాలేదనడంలో వాస్తవం లేదన్నారు. పిసిసి చీఫ్‌గా విభేదాలు పరిష్కరిస్తానే తప్ప సృష్టించనన్నారు. 1999లో విభేదాల వల్లే ఓడిపోయామని, 2009లో లోపాల వల్ల సీట్లు తగ్గాయన్నారు.












Click it and Unblock the Notifications