స్కీమ్‌పై చిటపట: తొందరొద్దని జానా, విభేదించిన దానం

Jana Reddy and Danam Nagender
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రభుత్వం పథకాల పైన తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి బుధవారం అన్నారు. పథకాల పైన మంత్రివర్గంలో అందరితో చర్చించాలని ఆయన అన్నారు. తమకు సమాచారం లేకుండా ప్రకటించిన పథకాల పైన మంత్రివర్గంలో చర్చిస్తామని జానా చెప్పారు.

బయ్యారం ఎంవోయు తమ దృష్టికి రాలేదన్నారు. ఈ విషయమై తగిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతామని చెప్పారు. మే లోగా అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. జూన్ లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు.

అందరికీ చెప్పాలని లేదు: దానం

ప్రభుత్వం చేపట్టే పథకాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం అంతగా లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు పనికి వచ్చే పథకాలు ఏవైనా ఆహ్వానించదగ్గవేనని ఆయన అన్నారు. దానం రవీంద్ర భారతిలో శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు.

బంగారు తల్లిపై రగడ

ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారు తల్లి పథకం పైన కాంగ్రెసు పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజుకున్న విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే బంగారు తల్లి పథకం ప్రవేశ పెట్టారని, ఈ పథకం సక్రమంగా అమలుపర్చకుంటే తమను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తానని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.

తనకు బంగారు తల్లి గురించి తెలియదని, తెలుసుకొని స్పందిస్తానని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుసుకొని స్పందిస్తానని చెప్పడం ద్వారా ఆ పథకం తెలియకుండానే రూపొందిందని చెప్పే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అయితే, మంత్రులు దానం నాగేందర్, పితాని సత్యనారాయణలు భిన్నంగా స్పందించారు. మంత్రివర్గంలో చర్చించారని పితాని అంటే, మంచి పథకం చర్చించాల్సిన అవసరం లేదని దానం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+