హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ పేరుతో 8 మంది అమ్మాయిలకు వల, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Arrest
హైదరాబాద్: టెక్కీనని, మంచి ఉద్యోగమని చెప్పి ఏకకాలంలో 8 మంది అమ్మాయిలకు వల వేసిన ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయినా తెలుగు మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని అమ్మాయిలకు వల వేయడం పనిగా పెట్టుకున్నాడు. అతని పేరు మోటపర్తి వంశీకృష్ణ. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన మోటపర్తి వంశీకృష్ణకు ఇప్పటికే పెళ్లయింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఉద్యోగం లేదు. తెలుగు మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇలాగే ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి వివరాలను, ఫోన్ నంబర్ సేకరించాడు. తానే అబ్బాయి తండ్రిలా ఫోన్‌లో మాట్లాడి బురిడీ కొట్టించాడు. తర్వాత ఖరీదైన కారులో వారి ఇంటికి వెళ్లి అన్నీ మాట్లాడుకున్నాడు. చంద్రబాబుతో దిగిన ఫొటోను చూపించి తనకు తెలుగుదేశం పార్టీలో మంచి పలుకుబడి ఉందని చెప్పాడు.

విజయవాడకు చెందిన నేత వల్లభనేని వంశీకి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని చూపించి అది తనదేనని నమ్మించాడు. వివాహానికి వేదికగా హైటెక్స్‌ను బుక్ చేస్తున్నానని వారి నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నాడు. తర్వాత అమ్మాయితో తిరుగుతూ ఆమె తల్లిదండ్రుల నుంచి మరో రూ. 4.10 లక్షలను బ్యాంక్ ఖాతాలో వేయించుకున్నాడు.

నిశ్చితార్థం, పెళ్లి అనే సరికి ముఖం చాటేసేవాడు. అమ్మాయికి అనుమానం వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం తెలిసింది. బెంగళూరు, విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్‌కు చెందిన 8 మందిని తాను మోసం చేసినట్లు చెప్పాడు.

వంశీకృష్ణకు మోసాలు కొత్తకాదు. ప్రతిసారీ ఒకో కొత్త రంగంలో మోసాలు చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. గతంలో హైదరాబాద్‌లోని ఖరీదైన వ్యభిచార గృహాలను గుర్తించి నకిలీ విలేకరి అవతారమెత్తాడు. పాషా అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకుని కెమెరాలతో ఆ ఇళ్లకు వెళ్లేవాడు. జరుగుతున్న 'వ్యాపారాన్ని' బట్టి అమ్మాయిల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ కేసులో ఎస్ఆర్‌ నగర్ పోలీసులు 2010లో ఇద్దరినీ అరెస్టు చేశారు.

English summary
A man duping girls on the name software engineer has been arrested by cyber crime police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X