వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, బాలకృష్ణతో సై: పెద్దలవద్ద చిరు వెరీగుడ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవే ప్రధాన ఆకర్షణ. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి రేసులో ఉండేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పోటీ పడుతున్నారు.

ఈ రేసులో చిరంజీవే ముందుండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవినే ప్రధానంగా ఎలివేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి దూకుడుగా వెళ్తూ అధిష్టానం మెప్పును పొందారు. అదే సమయంలో రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ఇమేజ్ పెంచుకుంటున్నారు.

ఇటీవల కర్నాటక ఎన్నికల్లో చిరంజీవి చిక్‌మగ్‌ళూరు, బెంగళూరులలో ప్రచారం నిర్వహించారు. ఆ పర్యటనకు భారీ స్పందన వచ్చింది. దీంతో అతనిని మరో రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సిందిగా సూచించింది. ఇప్పటికే చిరంజీవి అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేశారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం ద్వారా 2014 రేసులో మరింత ముందుకెళ్లారంటున్నారు.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి దూకుడుగా వెళ్తూ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేశారు.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల రెండురోజుల పాటు చిరంజీవి చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో మరో రెండు రోజుల పాటు ప్రచారం చేయాలని అధిష్టానం చిరుకు సూచించింది.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

ఎన్నికల ప్రాచారంలో ఆయా పార్టీ అభ్యర్థులు, పార్టీల తరఫున ప్రముఖ కన్నడ నటులు ప్రచారం చేస్తున్నారు. స్థానిక నటుల కంటే చిరంజీవి కోసమే అభిమానులు ఎగబడుతున్నారు.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

చిరంజీవి తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఆ ప్రాంతంలోని కన్నడ ప్రజలు కూడా చిరును చూసేందుకు ఎగబడుతున్నారు. కన్నడ ప్రజలు కూడా స్థానిక నటుల కంటే చిరును చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారట.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

2009 ఎపి ఎన్నికల్లో చిరు ఇమేజ్ కారణంగానే 15 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డే అప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకుందామనే ప్రతిపాదనను అధిష్టానం పెద్దలకు సూచించారట.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

వైయస్ ప్రతిపాదన, కర్నాటకలో చిరుకు ప్రచారానికి వస్తున్న ఆదరణ, 2009 ఎన్నికల నాటి ఓట్ల శాతాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెసు పార్టీ చిరునే 2014 ఎన్నికల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రాహుల్ గాంధీ కూడా చిరు పట్ల మొగ్గు చూపిస్తున్నారట.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

చిరు దూకుడు, అధిష్టానం క్రమంగా పెరుగుతున్న ఇమేజ్ చూస్తుంటే బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డిలకు షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

రాష్ట్రంలో జగన్‌ను, టిడిపికి ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతున్న బాలకృష్ణను ఎదుర్కోవాలంటే చిరంజీవే అసలైన అభ్యర్థి అని రాష్ట్ర కాంగ్రెసులోను వినిపిస్తున్న మాట.

మంచి మార్కులు కొట్టేస్తున్న 'హీరో' (పిక్చర్స్)

అధిష్టానం నుండి, రాష్ట్ర కాంగ్రెసు నుండి ఇంతగా మంచి మార్కులు కొట్టేస్తున్న చిరంజీవి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని కాపాడగల్గుతారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 2009లో చిరు ఇమేజ్ కారణంగానే అన్ని ఓట్లు పడినప్పటికీ పిఆర్పీ దూకుడును చూసి చిరు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చిరంజీవికి వస్తున్న ఆదరణ ఓట్ల రూపంలోకి ఎంత వరకు మారుతుందనేది ప్రశ్న.

English summary
It is said that Congress Party High Command may announce Chiranjeevi as 2014 parties CM candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X