గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో అసమ్మతి సెగ: ఉమ్మారెడ్డితో వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ummareddy Venkateswarlu
గుంటూరు: కొద్ది నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో సెగ ప్రారంభమైంది. ఉమ్మారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఇటీవలె ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అంతలోనే ఆయన పట్ల జిల్లాలో అసంతృప్త గళాలు వినిపిస్తున్నాయి.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు తెనాలి ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించారు. దీనిపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. స్థానికేతరుడు అయిన ఉమ్మారెడ్డికి తెనాలి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉమ్మారెడ్డితో స్థానిక నేతలు ఆగ్రహంతో వాగ్వాదానికి దిగారు.

కాగా, జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో బుధవారం విభేదాలు వరుసగా బయటపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బ్రహ్మానంద రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు కొండారెడ్డి మధ్య కడప జిల్లాలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంఛార్జీ పదవి విషయంలో గొడవ రాజుకుంది. తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తర్వాత పలువురు కల్పించుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను మరోసారి విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ మురళీధర్, మరో నేత కొమ్మి లక్ష్మినాయుడు, కాకానిల మధ్య ఈ రోజు విభేదాలు బయటకు వచ్చాయి. జిల్లా కార్యాలయంపై ఆధిపత్య పోరు నడుస్తోంది. మేకపాటి సోదరుల ప్రోత్సాహంతో కన్వీనర్‌గా ఎన్నికైన మురళీ కార్యాలయానికి రాగా, కాకాని వర్గం తాళం వేసింది. దీంతో మురళీ కార్యాలయం బయటే మీడియా సమావేశం నిర్వహించారు.

English summary
It is said that YSR Congress Party Guntur district Telani leaders are unhappy with Ummareddy Venkateswarlu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X