వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్! మళ్లీ వెళ్లండి: చిరు ఫాలోయింగ్‌కి హైకమాండ్ ఫిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్/బెంగళూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రచారానికి కర్నాటకలో వచ్చిన అనూహ్య స్పందన కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో ఉత్సాహాన్ని నింపిందట. ఇటీవల చిరంజీవి కర్నాటకలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రచారానికి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. చిరును చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. కొన్ని సందర్భాలలో పోలీసులు వారిని అదుపు చేయలేక లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

కన్నడ నటులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్నాటకలోనే కన్నడ నటులకు కూడా రాని అనూహ్య స్పందన మెగాస్టార్‌కు వచ్చింది. కర్నాటకలో చిరంజీవికి వచ్చిన అనూహ్య స్పందనతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరింత ఫిదా అయిపోయిందట. ఎపిలోనే కాకుండా కర్నాటకలో చిరుకు అంతగా స్పందన వస్తుండటంతో ఆయనను మరో రెండు రోజులు పర్యటించాలని సూచించింది.

ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని, గురు, శుక్రవారాలతో ప్రచారం ముగుస్తుందని, ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు కూడా ప్రచారం చేయాలని చిరంజీవికి అధిష్టానం సూచించింది. దీంతో చిరంజీవి ఈ రోజు, రేపు తెలుగువారు అధికంగా ఉండే హోస్పేట, బళ్లారి నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ఈ రోజు కర్నాటక బయలుదేరుతున్నారు.

చిరంజీవి తొలి విడతలో చిక్‌మగ్‌ళూరు, బెంగళూరులలో పర్యటించారు. ఆ పర్యటనకు మంచి స్పందన వచ్చింది. ఆయనను చూసేందుకు భారీగా ప్రజలు, అభిమానులు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట కూడా జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

English summary
Central Minister Chiranjeevi draws huge crowds, Congress asks him to canvass in Karnataka for two more days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X