జగన్‌కి దాడి సెగ: కొణతాల సీరియస్, గంటా రెడ్‌కార్పెట్

దాడి పార్టీలోకి వస్తారని, ఆయన తనయుడు రత్నాకర్‌కు అనకాపల్లి స్థానాన్ని కేటాయిస్తారనే ప్రచారం జోరుగు సాగుతున్న నేపథ్యంలో కొణతాల రామకృష్ణ తన వర్గంతో ఈ రోజు భేటీ అయ్యారు. అనకాపల్లి సీటుపై కొణతాల క్యాంప్ ఆశలు పెట్టుకుంది. ఇలాంటి సమయంలో దాడి తనయుడికి హామీ ఇచ్చారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారట. దాడి రాకను కొణతాల వర్గం వ్యతిరేకిస్తుందని చెబుతున్నారు.
అనకాపల్లి సీటును దాడి రత్నాకర్‌కు ఇచ్చే పరిస్థితితో పాటు జిల్లా పార్టీపై తమ పట్టును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కొణతాల వర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. సాయంత్రం కొణతాల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడే అవకాశముంది.
దాడిని ఆహ్వానిస్తాం: గంటా
దాడి వీరభద్ర రావు కాంగ్రెసు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఆయనతో తాను రెండుమూడుసార్లు మాట్లాడానన్నారు. మనస్తాపంతోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడారన్నారు. కాగా, కొణతాల వర్గం వ్యతిరేకిస్తుండటం... కాంగ్రెసు రెడ్ కార్పెట్ పరుస్తున్న నేపథ్యంలో దాడి కాంగ్రెసు జెండానే భుజాన వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications