జగన్ సంతృప్తిపర్చకుంటే అంతే!, ఫ్యామిలీ ఏడ్చింది: దాడి

Dadi Veerabhadra Rao
విశాఖపట్నం: తాను శనివారం ఉదయం పది గంటలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలుస్తానని దాడి వీరభద్ర రావు శుక్రవారం అన్నారు. అనకాపల్లిలో కార్యకర్తలతో భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఏం తప్పు చేశానని అధినేత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో తనను దూరం పెట్టారని ప్రశ్నించారు.

తనను నమ్మని నాయకుడి వద్ద తాను పని చేయాల్సిన అవసరం లేదన్నారు. ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవలందించానని, వైయస్ రాజశేఖర రెడ్డి, చిరంజీవిలు గతంలో తనను ఆహ్వానించినా వారి పార్టీలలోకి వెళ్లలేదన్నారు. గతంలో ఇతరులు పిలిస్తే వెళ్లలేదని, ఇప్పుడు ఎవరు ఉండమన్నా ఉండే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో పలువురు కార్యకర్తలు టిడిపిలోనే ఉండమని చెప్పారన్నారు. పార్టీ అధినేతకు నమ్మకం లేనప్పుడు ఎలా ఉండాలన్నారు.

తాను రేపు ఉదయం జగన్‌ను కలుస్తానని, ఆయన సమాధానాలు తనకు సంతృప్తినివ్వని పక్షంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నా తాను వారితో కలిసి పని చేస్తానని అన్నారు. ఒక పార్టీలో ఉన్నవారు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే తాను తెలుగుదేశం పార్టీని వదిలేసినట్లు చెప్పారు. ఇన్నాళ్లు టిడిపి ఆశయాలకు అనుగుణంగా మండలిలో వ్యవహరించానన్నారు.

అనకాపల్లిలో పాదయాత్ర విజయవంతం చేశామని, అయినా తన కుమారుడి పేరును బాబు ప్రస్తావించలేదన్నారు. తనను చూసి అసహ్యించుకుంటున్నారని తెలిసే బయటకు వచ్చానన్నారు. తాను టిడిపిని వీడినప్పుడు తన కుటుంబ సభ్యులు ఏడ్చారని చెప్పారు. తాము ఎక్కడున్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల కోసం పని చేస్తామన్నారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+