వైయస్ జగన్ పార్టీ ఫ్లెక్సీలో మళ్లీ ప్రిన్స్ మహేష్ బాబు

కాగా, ఫ్లెక్సీల గొడవ ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. నిత్యం హీరోలు, ఇతర పార్టీల నేతల ఫోటోలను ఉపయోగించుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొద్దిరోజుల క్రితం హైదరాబాదు సమీపంలోని బాలాపూర్ ప్రాంతంలోను అదే పని చేశారు. ఇతర పార్టీల నేతలు, హీరోల ఫోటోలను వినియోగించుకోవడంపై విమర్శలు వస్తున్నప్పటికీ జగన్ పార్టీ నాయకులు మాత్రం తగ్గటం లేదు.
హనుమాన్ జయంతి సందర్భంగా బాలాపూర్ చౌరస్తాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు, ప్రముఖ టాలీవుడ్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల ఫోటోలను పొందుపర్చారు. ఇది స్థానికంగా కలకలం రేపింది.
బెజవాడ టు హైదరాబాద్ విజయవాడలో ప్రారంభమైన ఫ్లెక్సీల గోల హైదరాబాదుకు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానితో పాటు పలువురు నేతలు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తమ ఫ్లెక్సీలలో ఉపయోగించిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మహేష్ బాబు ఫోటోలను కూడా పలుచోట్ల నాయకులు తమ తమ ఫ్లెక్సీలలో ఉపయోగించారు. కాంగ్రెసు పార్టీ కూడా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను పెట్టింది. జగన్ పార్టీ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్‌ల ఫోటోలను ఉపయోగిస్తోంది.












Click it and Unblock the Notifications