మరో ఇఫ్లూ విద్యార్థి ఆత్మహత్య, తమిళనాడు వాసి

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - ఇఫ్లూలో పిహెచ్‌డి చదువుతున్న తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతానికి చెందిన మహమ్మద్ మొయినుద్దీన్(33) ఇటీవలే తమ స్వగ్రామానికి వెళ్లివచ్చాడు. పిహెచ్‌డి వైవా కోసం వచ్చి రెండు రోజుల నుంచి ఇఫ్లూకు సమీపంలో ఉన్న మజీద్‌లో ఉంటున్నాడు.
గురువారం మధ్యాహ్నం మజీద్‌లోని మొదటి అంతస్తులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇఫ్లూ పిహెచ్‌డి స్కాలర్ ముదాస్సిర్ కమ్రాన్ ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఆత్మహత్య చేసుకున్న మొయినుద్దీన్ అరబిక్‌లో పరిశోధన చేశాడు. తమిళ భాషలో సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
జీవితాన్ని వృధా చేసుకున్నానని, మానసిక వ్యధకు గురయ్యానని అతను ఆ సూసైడ్ నోట్‌లో రాశాడు. తన మరణం గురించి సోదరికి చెప్పవద్దని అతను కోరాడు. మొయినుద్దీన్ చాలా తెలివైనవాడని, పిహెచ్‌డి పరిశోధన అద్భుతంగా చేశాడని అతని పర్యవేక్షకుడు డాక్టర్ సయ్యద్ జహంహీర్ అంటున్నారు.












Click it and Unblock the Notifications