స్నేహితులతో కలిసి లవర్‌పై రేప్: వీడియోలతో బెదిరింపు

డిగ్రీ విద్యార్థినిపై ప్రియుడు సంజీవ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కలిసి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ ఫోన్‌తో వీడియో తీశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వాటిని నెట్లో పెడతామని వారు వేధిస్తుండటంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రియుడిని బాధితురాలు, మహిళా సంఘాలు చితకబాదాయి.
వివాహితపై అత్యాచారయత్నం
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో శుక్రవారం ఓ యువకుడు వివాహితపై అత్యాచారయత్నం చేశాడు. యువకుడి తీరును పసిగట్టిన మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆమె తన బంధువులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని బిడ్డను చంపిన తల్లి
గుంటూరు జిల్లాలో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే కారణంతో ఓ తల్లి బిడ్డను చంపిన ఘటన చోటు చేసుకుంది. ఇతర ప్రాంతం నుండి గుంటూరు జిల్లాకు వచ్చిన భార్యాభర్తలకు నిత్యం గొడవ జరుగుతుండేది. భార్య ప్రవర్తనే దానికి కారణమని తెలుస్తోంది. అయితే, తన అక్రమ సంబంధానికి బిడ్డ అడ్డు వస్తుందని భావించిన తల్లి కూతురు గొంతు నులిమి చంపింది.
నిర్భయ చట్టం కింద కేసు
విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఓ యువకుడిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. యువకుడు ఓ వివాహితకు సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని పట్టుకున్నారు.
కోడలిపై కిరోసిన్ పోసి....
అనంతపురం జిల్లాలో కోడలి పై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నాలు ఓ అత్త చేసింది. తనను కాపురానికి తీసుకు వెళ్లమంటూ కోడలు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. ఆగ్రహించిన అత్త కిరోసిన్ పోసింది. స్థానికులు అడ్డు తగలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications