మెదక్ బంద్: కెసిఆర్‌పై జగ్గారెడ్డి పైచేయి, హరీష్ అరెస్ట్

మెదక్ జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా బందు జరుగుతోంది. తెరాస నేతలు, ఎమ్మెల్యేలు పలుచోట్ల బస్సులను అడ్డుకున్నారు. సిద్దిపేట బస్ డిపో ఎదుట శాసనసభ్యుడు హరీష్ రావు బైఠాయించారు. బస్సులను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు హరీష్ రావుతో సహా పలువురిని అరెస్టు చేశారు.
గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నారాయణఖేడ్ తదితర బస్సు డిపోల ముందు తెరాస నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మెదక్ ఆర్టీసి డిపో ఎదుట ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
సంగారెడ్డిలో కనిపించని బంద్
మెదక్ జిల్లా ప్రజలు బందుకు సహకరించరని, సంగారెడ్డిలో బందు ప్రసక్తే లేదని జగ్గారెడ్డి ఇటీవల తెరాసకు సవాల్ చేశారు. జగ్గారెడ్డి చెప్పినట్లుగానే సంగారెడ్డిలో బందు ప్రభావం అంతగా కనిపించడం లేదు. కొంతమంది తెరాస కార్యకర్తలు బయటకు వచ్చి ఆందోళన చేపట్టినా ప్రభావం కనిపించడం లేదు. సంగారెడ్డిలో పలుచోట్ల గుమికూడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసు బస్సులు యథావిథిగా నడుస్తున్నాయి. వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. ఆందోళనకారులు పలుచోట్ల బస్సులను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications