భార్యపై ఫిర్యాదుకు తల్లిపై దాడి, తాగుడుతో మరొకరు

తీవ్ర గాయాలైన ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనయుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యపై ఫిర్యాదు చేసిందని తల్లిపై దాడి
ఓ తనయుడు తన భార్యపై ఫిర్యాదు చేసిందని తల్లిపై దాడి చేసిన సంఘటన కర్నూలులో జరిగింది. జిల్లాలోని ఓర్వకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కొడుకు తల్లిని రాయితో కొట్టాడు.
ముగ్గురి ఆత్మహత్య
అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
దంపతుల ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని మునిరాబాద్ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారి పైన ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని స్కార్పీయో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications