కన్నడనాట చిరు ప్రచారం: తమిళనాడు నుంచి ఫ్యాన్స్

స్వచ్ఛమైన పాలనకోసం కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భావి ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం సౌమ్య స్వభావి అయిన కాంగ్రెస్ అభ్యర్థి శివణ్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టిన ప్రచార ర్యాలీలో చిరంజీవి పాల్గొన్నారు.
కాగా, చిరంజీవిని చూసేందుకు స్థానికులే కాకుండా తమిళనాడులోని హోసూరు తదితర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో మాజీ మంత్రి రామలింగారెడ్డి, ఎంపి కేశవమూర్తి, పరిషత్ ప్రతిపక్ష ఉపనేత బిటి దయానంద రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు రఘువీరా రెడ్డి, టిజి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ పాల్గొన్నారు. రాయచూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆమె గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. బిజెపి పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్‌ను గెలిపిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications