జమ్ములో పాక్ ఖైదీపై దాడి: పాక్‌లో లాయర్ కాల్చివేత

జమ్మూ కాశ్మీర్‌లో జైలులో పాక్ ఖైదీపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ దాడికి సంబంధించి జైలు సూపరింటెండెంట్, సిబ్బందిని ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది.
పాకిస్తాన్‌లో 26/11 ముంబై దాడి కేసు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజిర్ భుట్టో హత్య కేసులను వాదిస్తున్న సీనియర్ న్యాయవాదిని దుండగులు ఇస్లామాబాదులో కాల్చి చంపారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కారుల వస్తున్న న్యాయయవాది జుల్ఫికర్ అలీ పైన ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆ లాయరు అక్కడికక్కడే మృతి చెందాడు. న్యాయవాది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
సరబ్‌జిత్‌కు ఆరు గాయాలు
పాకిస్తాన్ జైలులో తోటి ఖైదీల చేతిలో గాయపడి రెండు రోజుల క్రితం మృతి చెందిన సరబ్‌జిత్ సింగ్‌కు ఆరు గాయాలు అయినట్లుగా వైద్యులు గుర్తించారు. తల, గుండె భాగాల్లో బలమైన గాయాలు అయ్యాయని గుర్తించారు. వారం రోజుల క్రితం సరబ్ తోటి ఖైదీల చేతిలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతనిని ప్ర్తత్యేక విమానంలో నిన్న భారత్‌కు తీసుకు వచ్చారు. సరబ్‌కు ఈ రోజు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు.












Click it and Unblock the Notifications