వైయస్ లాంటి తప్పు చేయొద్దు: కిరణ్ రెడ్డిపై విహెచ్ ఫైర్

V Hanumanth rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. 2014 వరకు తెలంగాణ రాదని ముఖ్యమంత్రితో ఎవరన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాల్సిన అవసరం ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఏం చేస్తోందో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియాల్సిన ఇవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే సమాధానం ఇవ్వడం లేదని, లేఖలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా కోర్ కమిటీలో, సిడబ్ల్యుసీలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి పార్టీ అధిష్టానం అండదండలే కాదు, కార్యకర్తలూ ప్రజల అండదదండలు కూడా లభించేట్లు చూసుకోవాల్సి ఉంటుందని విహెచ్ అన్నారు.

అవినీతి బిజెపి ప్రభుత్వాన్ని దించాలని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. కర్ణాటకలో కాంగ్రెసు విజయం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో దోచుకున్నవారే అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మంత్రులు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యులం కాదని అప్పటి మంత్రులు అంటున్నారని, అలాంటి తప్పును కిరణ్ కుమార్ రెడ్డి చేయవద్దని ఆయన అన్నారు. వైయస్ హయాంలో మంత్రివర్గంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుని తప్పు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమాలు, ధర్నాలు చేశామని ఆయన చెప్పారు. ఆఖరికి బస్సు కింద పడమన్నా పడుతామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+