చెడ్డ పేరు వద్దు: దాడిపై యనమల పరోక్ష విసుర్లు

రాజకీయ నాయకులకు నైతిక విలువలు, విశ్వసనీయత ఉండాలని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు తనకు పదవి ఇవ్వకపోయినా తాను బాధపడలేదని, ప్రజలకూ పార్టీకీ సేవ చేశానని ఆయన చెప్పారు. ఆకాంక్ష ఉంటే ప్రజా సేవకు పదవులు అక్కర లేదని ఆయన అన్నారు. పదవుల కోసం కాకుండా రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీగా చట్టసభల గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. చట్టసభలో ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆయన చెప్పారు. చట్టసభల సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలను ఎత్తి వేయించడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన చెప్పారు. అవకాశాలు రానప్పుడు బాధపడడం, వచ్చినప్పుడు సంతోషపడడం సరి కాదని ఆయన అన్నారు.
దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం ఇవ్వకుండా యనమల రామకృష్ణుడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఈ విషయంపై తనతో కనీసం చంద్రబాబు సంప్రదించలేదని దాడి వీరభద్రరావు మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications