'కెసిఆర్ అంటే ఏంటో కిరణ్ కుమార్ రెడ్డికి చూపిస్తాం!'

ఈ సందర్భంగా కిరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కెసిఆర్ దెబ్బ ఏంటో ముఖ్యమంత్రికి రుచి చూపించాలని, ఈ మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. తాము డిమాండ్ చేసినట్లుగా ఈ మూడు జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలను ఎక్కడికీ తరలించకుండా నిరోధించాలనీ, వరంగల్ లేదా ఖమ్మం జిల్లాలో లేదా రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు ఆందోళనలు చేపట్టాలనీ నిర్ణయించారు.
తద్వారా కిరణ్‌కు కునుకు లేకుండా చేయాలన్న కెసిఆర్.. ఆందోళనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణను సిద్ధం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా, ఈనెల 15 నుంచి జూన్ 5 వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీల బాధ్యులకు రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రతి రోజు ఆరు చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో శిబిరాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా అనుకొన్నారు.
మరోవైపు కెసిఆర్‌ను తిడితే కాంగ్రెస్‌కు సీమాంధ్రలో ప్లస్ పాయింట్ అవుతుందనే ముఖ్యమంత్రి తెరాస అధినేతపై అంతగా నోరు చేసుకొన్నారని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సిటింగ్ ఎమ్మెల్యేలతోపాటు, 15 మందితో తొలి జాబితా? వచ్చే ఎన్నికల కోసం ఈ నెల మధ్యలో అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడిస్తామని ఇప్పటికే వెల్లడించిన కెసిఆర్, ఆ మేరకు కసరత్తు చేస్తున్నారట. సిటింగ్ ఎమ్మెల్యేలతోపాటు, మరో 10-15 మందితో తొలి జాబితాను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని శనివారం నాటి భేటీలో ఆయన ప్రస్తావించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications