వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్: ఈసారి ఖచ్చితంగా.. ఆశల పల్లకిలో పార్టీ క్యాడర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయమై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు తేల్చే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబిఐ వరుసగా ఛార్జీషీట్లు దాఖలు చేస్తోందని కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై వారం రోజుల క్రితం సిబిఐ, జగన్ తమ తమ వాదనలను వినిపించారు.

ఇరవైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు గతంలో జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినప్పుడు కోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? అని సిబిఐని ప్రశ్నించింది. ఈ నెల 6లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సిబిఐని ఆదేశించింది. ఈ రోజు సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు జగన్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు చెప్పే అవకాశాలు ఉన్నాయి. లేదా కొద్ది రోజులు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.

జగన్ పార్టీ కోటి ఆశలు!

సిబిఐ వాదనలో పసలేదని, వరుస ఛార్జీషీట్లు వద్దన్నా సిబిఐ సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తోందని కాబట్టి తన అధ్యక్షుడికి ఈ రోజు బెయిల్ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్నాయి. గతంలో జగన్ బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి అభిమానులు, పార్టీ క్యాడర్ వస్తుందని ధీమా వ్యక్తం చేసేవి. ఈ నెల 6వ తేదిన జగన్‌కు బెయిల్ వస్తుందని తాను విశ్వసిస్తున్నానని జూపూడి ప్రభాకర రావు రెండు రోజుల క్రితం చెప్పారు.

పార్టీ క్యాడర్ మొత్తం జగన్ బెయిల్‌కు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జగన్ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలేదని, ఈసారి మాత్రం కోర్టు ఒకే ఛార్జషీటు వేయాలంటూ సిబిఐకి సూచించిందని కానీ, సిబిఐ అందులో విఫలమైనందున తమ అధ్యక్షుడికి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని వారు గట్టిగా చెబుతున్నారు.

English summary

 Some clarity may emerge on Monday on the issue of granting bail to Y.S. Jagan Mohan Reddy when the Supreme Court resumes its hearing on the plea by the YSCR president, who would be completing one year in jail on May 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X