ఆటోలో ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్, దంపతుల ఆత్మహత్య

Rape
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుర్మాగుడాకు చెందిన ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

కుర్మాగుడాకు చెందిన బాలిక సమీప బంధువు ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు యువకులు ఆమెను ఆటోలో ఖాజాబాద్‌కు తీసుకుని వెళ్లి అక్కడ అత్యాచారం జరిపిరాు. స్థానికులు గమనించి వారిని పట్టుకోబోయారు. దాంతో వారు ఆటోలో పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని క్రిస్టియన్ పేటలో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రమణారెడ్డి, రమణమ్మ అనే వృద్ధ దంపతులు కుటుంబ కలహాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాీరు. కావలి శివారులో వీరిద్దరూ సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

దొంగల ముఠా పట్టివేత

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఠా సభ్యుల నుంచి పోలీసులు రూ. 14.20 లక్షల నగదుతో పాటు 460 గ్రాముల బంగారం, 2.50 కిలోల వెండిన స్వాధీనం చేసుకున్నారు. మిత్రులైన అర్జున్, దుర్గారావు, రాజు, ప్రతాప్, శ్రీకాంత్ తదితరులు ప్రకాశం జిల్లా నుంచి వచ్ిచ హైదరాబాదులోని అడ్డగుట్టలో నివాసం ఉంటున్నారు.

ఉదయం పూట వారు చెత్త ఏరుకుంటూ రెక్కీ నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతున్నారని నార్త్‌ జోన్ డిసిపి శ్రీకాంత్ తెలిపారు. వీరిపై ఇప్పటికే 15 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

ట్రాక్టర్ బోల్తా, ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని పేరేపల్లి నుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేరేపెల్లి గ్రామానికి చెందిన గుర్రాల సంజీవ్ (16), కలవనే శ్రీనివాస్ (12), కలవేన రమేష్ (14), సిద్ధం మారుతి (10) ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. గుర్రాల సంజీవ్ అక్కడికక్కడే మరణించాడు.

తూర్పు గోదావరి జిల్లా పామర్రు హరిటేజ్ పరిశ్రమ వ్యర్థ జలాల చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+