ఒకే వేదికపై అన్నగారి కుటుంబం: లక్ష్మీ పార్వతి హ్యాపీ

NTR family at single platform
న్యూఢిల్లీ: పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ అన్నగారి కుటుంబాన్ని ఒకేచోటకు చేర్చింది. ఈ రోజు ఉదయం స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటులో న్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి లక్ష్మీ ప్రణతి, నందమూరి లక్ష్మీ పార్వతి.... ఇలా కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అన్నగారి కుటుంబాన్ని ఒకేచోట చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లక్ష్మీపార్వతి, బాలకృష్ణలో ఒకేచోట పక్కపక్కన నిల్చున్నారు. వారి ఫోటోలను తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా పలువురు వద్దని సూచించారు. అందరూ ఒకే వేదికపైకి రావడంపై లక్ష్మీ పార్వతి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మరుపురాని ఘటన అని, అందరు ఒకేచోట చేరడం ఆనందం కలిగించిందన్నారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో తనను తానే మర్చిపోయానని, విగ్రహావిష్కరణకు పూనుకున్న పురంధేశ్వరికి కృతజ్ఞతలు అని, తాను ఏమైనా అంటే మనసులో పెట్టుకోవద్దని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి ఆహ్వానాలు పంపలేదని మీరా కుమార్ చెప్పారన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

చంద్రబాబు నాయుడు, తాను మాట్లాడుకున్నట్లు చెప్పారు. అంతా సానుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఇది మరుపురాని, మర్చిపోలేని అనుభూతి అన్నారు. కుటుంబమంతా ఒక్కచోటకు వచ్చిందని ఆమె ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మీ పార్వతి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+