ఎన్టీఆర్ నుండే నేర్చుకున్నా: బాబు, ఎన్టీఆర్‌పై పుస్తకం

ఆయన కింద పని చేయడం మర్చిపోలేని అనుభవమన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తన చిరకాల కోరిక అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్ అహ్నిషలు శ్రమించారన్నారు. ఎన్టీఆర్‌తో రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్నో అనుభూతులను పొందానని చెప్పారు. దేశవ్యాప్తంగా తెలుగు జాతి మరిచిపోలేని వ్యక్తి అన్నారు. పార్లమెంటులో విగ్రహావిష్కరణ అందరికీ ఆనందం కలిగించిందన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. తెలుగుజాతి మర్చిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు తెలుగు జాతికే గర్వకారణమని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అన్నారు. ప్రాంతీయ పార్టీలను జాతీయస్థాయిలో ఏకం చేసిన గొప్ప నేత అని, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు టిడిపి ఎంతో కృషి చేసిందన్నారు.
ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేం పుస్తకావిష్కరణ
స్వర్గీయ నందమూరి తారక రామారావుపై రాసిన 'యుగపురుషుడు - ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి దంపతులు, బాలకృష్ణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. అవినీతి మకిలి అంటని నేత ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణ, చంద్రబాబు నాయుడు రాలేదు.












Click it and Unblock the Notifications