సమ్మర్ హీట్: చల్లబడ్డాకే తెరాస బయ్యారం పాదయాత్ర!

ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు యాత్ర నిర్వహణకు అధిష్ఠానం ముఖ్యులు సుముఖంగా లేరని సమాచారం. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న పరిస్థితుల్లో పాదయాత్ర నిర్వహణ ఆచరణ సాధ్యంకాదని వారు భావిస్తున్నారు.
జూన్‌లో వర్షాలు మొదలయ్యాకే పాదయాత్ర చేయాలని పార్టీ నేతలకు అధినేత నిర్దేశించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్న వారికే తొలి జాబితాలో చోటు ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నెల 15 వరకు 20-30 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు.
నియోజకవర్గాల సర్వే ఫలితాలను త్వరగా తెప్పించుకోవాలని, స్థానికంగా వివిధ వర్గాల ద్వారా ఆరాతీసి అభ్యర్థుల జాబితాను రూపొందించి తనకు సమర్పించాలని నాయినికి కెసిఆర్ సూచించారట. పార్టీ పొలిట్‌బ్యూరోసహా రాష్ట్ర కమిటీ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించాలని కెసిఆర్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications