సాయి రెడ్డి రెండు పిటిషన్లు కొట్టివేత, ఒకదాంట్లో ఊరట

Vijaya Sai Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: మొదటి ఛార్జీషీటుపై దర్యాఫ్తు పూర్తయ్యే వరకు వాదనలు వినే ప్రక్రియను వాయిదా వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లలో రెండింటిని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.

వాన్‌పిక్ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్లు హైకోర్టుకు సిబిఐ చెప్పినందున ఆ అంశంపై అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయొచ్చని స్పష్టం చేసింది. దీంతో సాయికి కొంత ఊరట లభించింది. తనపై సిబిఐ అన్ని చార్జిషీట్లలోనూ ఒకే రకమైన అభియోగాలు నమోదు చేస్తోందని, ఇకపై వేసే చార్జిషీట్లపై కూడా అలాంటి అభియోగాలే ఉండే అవకాశం ఉన్నందున అన్ని చార్జిషీట్లు వేశాక మాత్రమే అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని సాయి గతంలో సిబిఐ కోర్టును కోరారు.

వాటిపై జడ్జి దుర్గా ప్రసాద రావు గత నెల 24న ఇరుపక్షాల తుది వాదనలు విని, తీర్పును సోమవారానికి రిజర్వు చేశారు. సోమవారం తీర్పు ఇస్తూ.. పిటిషన్‌దారుడు భావించినట్లు ఆయనపై సిబిఐ ఇకముందు కూడా ఒకే రకమైన అభియోగాలను నమోదు చేస్తుందని ఇపుడే ఒక నిర్ణయానికి రాలేదమని, ఈ నేపథ్యంలో సాయి దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదించలేమని, వాటిని డిస్మిస్ చేస్తున్నామని పేర్కొన్నారు.

వాన్‌పిక్ వ్యవహారం అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయాలన్న సాయి అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా సిబిఐ.. ఆరో నిందితుడు బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ సందర్భంగా దర్యాఫ్తు కొనసాగుతుందని, అదనపు ఛార్జీషీటును దాఖలు చేస్తామని తెలిపింది. అయితే, ఈ వ్యవహారంపై వీలైనంత త్వరగా దర్యాఫ్తు పూర్తి చేయాలని సిబిఐకి కోర్టు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+