జయప్రదకి ప్లాట్‌ఫాం దొరికిందా?, రాజ్యసభకు ఉండవల్లి!

కానీ, రాజమండ్రి బరిలో నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్ ఉండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బొమ్మన రాజ్ కుమార్, బొడ్డు భాస్కర రామారావు తనయుడు తదితరుల మధ్య పోటీ నెలకొంది. దీంతో జయప్రదకు ఆ రెండు పార్టీల నుండి రాజమండ్రి టిక్కెట్ పైన హామీ రాలేదు. దీంతో ఆమె కాంగ్రెసు గడప తొక్కారట. ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్న ఆమెకు రాజమండ్రి టిక్కెట్ పైన హామీ వచ్చి ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
రాజమండ్రి టిక్కెట్ పైన హామీ వచ్చినందున ఆమె కాంగ్రెసు గూటికి వెళ్లేందుకు సిద్దపడ్డారట. అయితే, ఇప్పటికే రాజమండ్రి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ సీటును వదులుకుంటారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఉండవల్లికి ప్రత్యామ్నాయం కూడా చూపించి ఉంటారంటున్నారు.
వచ్చేసారి ఆయనను రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశ్యంతో అధిష్టానం ఉన్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీకి ఆయన మొదటి నుండి ఎనలేని సేవలు చేస్తున్నారు. రాజమండ్రి టిక్కెట్ జయప్రదకు ఇచ్చిన పక్షంలో ఉండవల్లిని రాజ్యసభకు పంపించాలనే ఆలోచన పెద్దల మదిలో ఉందట. ఉండవల్లి కూడా రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications