ఓ నమస్కారం పెట్టి వెళ్లాలి!: కొణతాల, పెద్దల బుజ్జగింపు

 Konathala Ramakrishna
హైదరాబాద్/విశాఖ: ఓ పార్టీలో ఉన్నప్పుడు అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, లేదంటే ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నదే తన ఆశయం, ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.

తన సొంత జిల్లా విశాఖకు చెందిన దాడి వీరభద్ర రావు పార్టీలో చేరడంపై ఆయన వర్గం అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే తాను పార్టీలోకి వచ్చానని, ఈ పార్టీ తన పుట్టినిల్లు వంటిందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోవేదనను పరిగణలోకి తీసుకోకుంటే ఆ పార్టీ ఉంటుందా అని ప్రశ్నించారు.

తాను పోరాటాల నుండి వచ్చిన వాడినే కానీ, వెనుక డోర్ నుంచి వచ్చిన వాడిని కాదన్నారు. దాడి వ్యవహారం పార్టీ అంతర్గతమన్నారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీల్లో ఏ సమస్య ఎక్కడ మాట్లాడాలో ఎక్కడే మాట్లాడాలన్నారు. పార్టీలో ఇలాంటివన్నీ సహజమేనని చెప్పారు. ఏ రోజ ప్రలోభాలకు లోనైన వ్యక్తిని తాను కాదన్నారు. భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.

కోవర్టు ఆపరేషన్లు చేసేందుకు కొంతమంది పార్టీలోకి వస్తున్నారని, కోవర్టులను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని జగన్‌కు సూచించానన్నారు. తన పార్టీలో ఎవరి సలహాలు వినాల్సిన అవసరం లేదన్నారు. తాను అధిష్టానంతో చర్చించాల్సిందేమీ లేదని ఆయన చెప్పారు. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకు తాను నడుచుకుంటానని అన్నారు. మరోవైపు కొణతాలను బుజ్జగించే పనిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడింది. పార్టీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, రామకృష్ణా రెడ్డిలు రెండు మూడు గంటలుగా కొణతాల వర్గంతో భేటీ అయి అలకమాన్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+