ఢిల్లీలో అత్యాచారం చేసినా బాబు మాట్లాడట్లేదు: అంబటి

కేంద్రం అవినీతి మంత్రులను తొలగించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యం మంట కలిసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ గేట్ వ్యవహారంలో సిబిఐ నివేదికను తారుమారు చేసి పెద్దలను తప్పించారని ఆరోపించారు.
ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేసినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించక పోవడం దారుణమన్నారు. సిబిఐ అంటే చంద్రబాబుకు భయమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును చంపిన చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లడం బాధాకరమన్నారు.
తమ పార్టీకి చెందిన నేతలు కొణతాల రామకృష్ణ, కొండా సురేఖలు పార్టీలోనే ఉన్నారన్నారు. వారి విషయంలో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి విష ప్రచారానికి తెరలేపారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications