వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ దత్ కేసులో ఒత్తిళ్లు: విజయరామారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Rama Rao
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేసులో తన హయాంలో సిబిఐపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని, అయినా చార్జిషీట్ దాఖలు చేశామని సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు చెప్పారు. బొగ్గు కుంభకోణం నివేదికను న్యాయశాఖా మంత్రికి చూపించడాన్ని ఆయన తప్పు పట్టారు. "సిబిఐ, నేరపరిశోధన సంస్థలు - స్వయంప్రతిపత్తి సాధ్యాసాధ్యాలు" అనే అంశంపై జన చైతన్య వేది, అప్పా మంగళవారం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

న్యాయశాఖ మంత్రికి నివేదికలు చూపించిన ఘటనలు తన హయాంలో ఏనాడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ డైరెక్టర్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ఆచరణలో సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి సిబిఐపై ఒత్తిళ్లు ఉండడం సహజమేనని ఆయన అన్నారు.

సిబిఐని విభజించి అవినీతి నిరోధక విభాగాన్ని స్వతంత్రంగా ఉంచాలని కేందర్ హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మంత్రులపై చార్జిషీట్ దాఖలు చేసినా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.

ముంబై బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు నివేదికను న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌కు చూపించినట్లు సిబిఐ అంగీకరించడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈ సదస్సు ఏర్పాటైంది.

English summary
Speaking at a seminar on investegating agencies, CBI former director Vijaya Ramarao said that fovernment pressures on CBI are normal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X