వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిఎస్సార్ పార్టీ గతే జగన్ పార్టీకి: కర్నాటకపై లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కర్నాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు కాంగ్రెసు వైపే చూస్తున్నారన్నారు. ధనబలంతో శాసించగలమని బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార భారతీయ జనతా పార్టీ నుండి విడిపోయిందని, అలాంటి అవినీతి పార్టీని ప్రజలు కర్నాటకలో మట్టికరిపిస్తున్నారన్నారు.

అహంకారంతో పెట్టిన పార్టీ అలాగే కూలిపోతుందన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీరాములు సెంటిమెంటు కారణంగా గెలుపు సాధించి అదే తరహా రాష్ట్రంలో ఉంటుందని భావించారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి తప్పదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పథకాలను జగన్ తమవిగా ప్రచారం చేసుకోవడం వల్ల కాంగ్రెసు పార్టీ కొద్దికాలం ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు.

కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు బలహీనపడలేదని, ఓట్లు మాత్రమే జగన్, కాంగ్రెసుగా చీలాయన్నారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. వచ్చేసారి కాంగ్రెసు పార్టీ వైపే అందరూ వస్తారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మేలుకుంటున్నారని సహకార ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుందన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కర్నాటకలో ప్రచారం చేయడం వల్ల కాంగ్రెసు పార్టీకి మరింత లబ్ధి చేకూరిందన్నారు. ఆయన ప్రచారానికి ముందు బిజెపి రెండో స్థానంలో ఉండగా.. ఆయన ప్రచారం తర్వాత కాంగ్రెసుకు మరింత ఓట్ల శాతం పెరగడమే కాకుండా.. జెడిఎస్ రెండో స్థానానికి ఎగబాకిందన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal said on Wednesday that YSR Congress Party will not win in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X