ఆఫీస్ లో ఈ దిశలో కూర్చుంటే మామూలుగా ఉండదు!
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు ఆశించిన గుర్తింపు, కెరీర్ వృద్ధి లభించవు. దీనికి ఆఫీసులోని వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పని చేసేటప్పుడు కూర్చునే దిశ మన ఆలోచనా సరళిని, ఏకాగ్రతను, పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కార్యాలయాలలో ఉద్యోగుల సీటింగ్ ఏ దిశగా ఉండాలి. ఏ దిశలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకుందాం.
ఆఫీస్ లో తూర్పు దిశలో సీటింగ్.. ఫలితాలు ఇలా
ఆఫీస్ లో పని చేసేచోట సీటింగ్ అమరికకు అన్నిటికంటే తూర్పు దిశ అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. తూర్పు ముఖంగా కూర్చుని పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.తూర్పు దిశ చాలా సానుకూలతలను ఇచ్చే దిశ. సూర్యుడు ఉదయించే తూర్పు దిశ సానుకూల శక్తికి, కొత్త ఆశలకు పుట్టినిల్లు. ఆఫీసులో ఈ దిశకు అభిముఖంగా కూర్చోవడం వల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

కొత్త ఆలోచనలకు, క్రియేటివ్ గా ఆలోచించేలా చేసే దిశ
తూర్పు దిశ నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇది మనం చురుగ్గా పని చేయటానికి దోహదం చేస్తుంది. దీనివల్ల పనిపై ఏకాగ్రత పెరగడమే కాకుండా, వినూత్నమైన ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త వ్యూహాలు రచించే వారికి, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కార్యాలయంలో నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన వారికి బాగుంటుంది.
ఈ దిశలో కూర్చుంటే మంచి గుర్తింపు
పరిశోధనలు చేసే వారికి మరియు విద్యార్థులకు కూడా తూర్పు ముఖం వైపు కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.ఇది మనం ఏ విషయాన్ని మర్చిపోకుండా సహాయం చేస్తుంది. వాస్తు ప్రకారం తూర్పు దిశ విజయానికి మరియు అధికారానికి చిహ్నం. ఈ దిశగా కూర్చుని విధులు నిర్వహించడం వల్ల ఆఫీసులో ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఇది ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
పనిచేసే డెస్క్ మాత్రమే కాదు చుట్టూ వాస్తు విషయంలో జాగ్రత్త
అయితే ఉద్యోగాలు చేసేవారు కేవలం ఆఫీస్ లో కూర్చునే దిశ విషయంలో జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాకుండా, పని చేసే డెస్క్ మరియు చుట్టుపక్కల వాతావరణం కూడా వాస్తు సమ్మతంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్ని విధాలా ఉద్యోగం, వ్యాపారం ఏదైనా రాణించే అవకాశం ఉంటుంది.













Click it and Unblock the Notifications