విద్యార్ధుల యూనిఫామ్ లో డీఈవో..! లోకేష్ రియాక్షన్ ఇదే..!
ఏపీలో ఇవాళే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి.
ఎక్కడ చూసినా విద్యార్ధులు పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలే కనిపించాయి. ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాలోని ఓ స్కూల్లో మాత్రం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఈ దృశ్యం ఆ పాఠశాలలో విద్యార్ధులకు అంత వింతగా అనిపించకపోయినా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ను మాత్రం నిజంగానే కదిలించింది.
అనకాపల్లి జిల్లా చోడవరంలోని మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు సందర్శించారు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న సందర్భంగా అక్కడి విద్యార్దులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు
ఆయన ఈ రెండు స్కూల్లకు వెళ్లారు. అయితే ఆయన సాధారణ దుస్తుల్లో కాకుండా స్కూలు విద్యార్ధులు ధరించిన యూనిఫామ్ ను కుట్టించుకుని, వేసుకుని మరీ వెళ్లారు. దీంతో డీఈవో స్కూలు యూనిఫామ్ లో ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు. "ఐక్యత- క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించిన విద్యార్థుల్లో తానూ ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు గారికి అభినందనలు. వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభం అయిన చోడవరం మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌కు యూనిఫామ్ ధరించిన డీఈవో, విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనలో పాల్గొని, ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకం." అంటూ లోకేష్ ఆయన్ను అభినందించారు.














Click it and Unblock the Notifications