బుజ్జగింపులు: మొండికేస్తున్న కొండా సురేఖ

పార్టీ నాయకత్వంతో రాజీకి వారు ఏ మాత్రం ఇష్టపడడం లేదని చెబుతున్నారు. వైయస్ జగన్‌కు, పార్టీ అధిష్టానం పెద్దలకు సన్నిహితులైన నాయకులు కొంత మంది కొండా దంపతులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమకు ఫోన్ చేసిన నాయకులతో కొండా దంపతులు తమ అసంతృప్తికి కారణాలను నిర్మొహమాటంగా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం వారిని పార్టీ ఎమ్మెల్యే ఒకరు కలిసినప్పుడు కూడా అదే విధమైన వైఖరిని ప్రదర్శించారని చెబుతున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష వ్యవహారాలు చూసే వ్యక్తి, శుక్రవారం ఇక్కడ కొండా దంపతుల నివాసానికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు.
అయితే, కొండా సురేఖ దంపతులను బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెసు పార్టీ నాయకత్వం కూడా కొండా సురేఖ దంపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా వారి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇంకా కొండా దంపతులు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 12 లేదా 13 తేదీల్లో కొండా దంపతులు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications