మూడోసారి నవాజ్ షరీఫ్: భారత్‌కు అనుకూలమేనా?

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికలలో పాకిస్తాన్ ముస్లీం లీగ్ - నవాజ్(పిఎంఎల్-ఎన్) 126 స్థానాలలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి పాకిస్తాన్ ప్రధాని కానున్నారు. తాజా విజయంతో నవాజ్ షరీఫ్ మూడోసారి ప్రధాని కానున్నారు.

పాకిస్తాన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన షరీఫ్ గతంలో 1990-1993, 1997-1999 మధ్య ప్రధానమంత్రిగా పని చేశారు. 199లో భారత్‌తో శాంతి చర్చలకు చొరవ చూపారు. ప్రచార సమయంలో యువతకు ఇచ్చిన వాగ్ధానాలను అన్నింటిని నెరవేరుస్తానని ఆయన అన్నారు.

 Nawaz Sharif as Pakistan PM will be good for India

నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని కావడం భారత దేశానికి అనుకూలమేనని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో భారత్‌తో శాంతి చర్చలకు తెరలేపారని, ఇప్పుడు ఆయన ప్రధాని అయితే మరోసారి అందుకు ఆయన సిద్ధంగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మరింత మెరుగు పడేందుకు నవాజ్ షరీఫ్ గెలుపు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాగా, నిన్న జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోని పార్టీ 126 స్థానాల్లో, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రిక్ ఐ ఇన్సాఫ్ పార్టీ 37 సీట్లను స్థాపించి ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది. అధికార పిపిపి ఘోర పరాజయం పాలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+