పిపిపికి నవాజ్ షరీఫ్ చెక్: 35 స్థానాల్లో ఇమ్రాన్ పార్టీ

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రిక్ ఐ ఇన్సాఫ్ 34 స్థానాలలో విజయం సాధించగా.. ఇతరులు 71 స్థానాల్లో గెలిచారు. అధికార పిపిపి కేవలం 32 స్థానాలలోనే గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఆరున్నర దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో శనివారం నాడు జరిగిన మైలురాయి వంటి సార్వత్రిక ఎన్నికలలో పిఎంఎల్ ఎన్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
కాగా, ఎన్నికల్లో తాము విజయం సాధించామని, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలకు రమ్మని భావ సారూప్యం గల ఇతర పార్టీలకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం కూడా పలికారని 'సమా' టివి చానెల్ కథనం ప్రసారం చేసింది. ప్రజల కోసం ఏ పార్టీతోనైనా, నాయకుడితోనైనా చర్చలకు తాను సిద్ధమని ఆయన ప్రకటించినట్లు తెలిపింది. మరోవైపు కార్యకర్తలు, నాయకులు ఆయన నివాసానికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నట్లు పేర్కొంది.
కాగా, పంజాబ్‌లోని సర్గోధా స్థానంలో షరీఫ్ విజయం సాధించారు. తమ పార్టీకి విజయం కట్టబెట్టిన ఓటర్లకు, అల్లాకు ఆయన కృతజ్ఞతలు అర్పించారని సమా టివి తెలిపింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఎ- ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పెషావర్-1 స్థానంలో 66,464 ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రజాస్వామ్యయుత అధికార బదిలీ దిశగా తొలిసారి నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రజలు మహోత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉగ్రవాద దాడులు, హింసాత్మక ఘటనల్లో 26 మంది మరణించగా పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యా రు. అయినప్పటికీ జనం వేలాదిగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఎన్నికల కమిషన్ మరో గంటపాటు సమయాన్ని పొడిగించాల్సి వచ్చింది. కరాచీలో పేలుళ్లు, ప్రజలకు ఇబ్బందుల నేపథ్యంలో రాత్రి 8:30గంటల వరకూ సమయమిచ్చింది. మొత్తంమీద 70-75 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఫక్రుద్దీన్ జి.ఇబ్రాహీం అభిప్రాయపడ్డారు. ప్రజాస్పందన అమోఘం, అనూహ్యమని ఆశ్చర్యం, ఆనందం వెలిబుచ్చారు.












Click it and Unblock the Notifications