వేటేయండి: జగన్ ఎమ్మెల్యేల సవాల్, సిద్ధమన్న గండ్ర

బహిరంగంగా కూడా వేటు వేయాలని కోరామన్నారు. అలాంటప్పుడు తమను మరోసారి పిలువడమెందుకని జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు ప్రశ్నించారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ పైన ఒత్తిళ్లు ఉన్నట్లుగా తమకు అనుమానం కలుగుతోందన్నారు. తమపై వేటు వేయాలని, జూన్ 2లోపు వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయని తాము కోరామని వారు అన్నారు. మరోసారి తాము వ్యక్తిగతంగా స్పీకర్ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు.
గైర్హాజరును ఖండించిన గండ్ర
స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పుడు ఎమ్మెల్యేలు ఎదుట హాజరుకాకపోవడమేమిటని గండ్ర వెంకటరమణ రెడ్డి జగన్ వర్గం రెబల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. తాము ఎన్నికలకు భయపడటం లేదన్నారు. వారు ఎదుట హాజరుకాకుండా లేఖలు రాయడం సరికాదన్నారు. స్వతంత్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ పైన కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వారిపై త్వరగా వేటు వేయాలని తాను స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.
విచారణకు రాకుండా ఫ్యాక్స్‌లు పంపడం ద్వారా వారు స్పీకర్‌ను అగౌరవపర్చారన్నారు. పార్టీలు మారే వారికి తగిణ గుణపాఠం చెప్పేలా వారిని ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉండాలన్నారు. కాగా, మద్దాల రాజేష్, గొట్టిపాటి రవికుమార్, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఆళ్ల నాని తదితరులపై ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications