ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితుడికి విషమిచ్చారు: లాయర్

జైలులో తోటి ఖైదీలు శర్మను కొట్టారని, తోసివేశారని అన్నారు. శర్మ పరిస్థితిపై జైలు అధికారులు ఏమీ మాట్లాడడం లేదు. అతన్ని హుటాహుటిన మంగళవారం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఛాతీ దెబ్బల కారణంగా అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. శర్మకు పెట్టిన ఆహారంలో విషం కలిపారని సింగ్ ఆరోపించారు.
స్లో పాయిజన్ వల్ల రక్తం వాంతులు జరుగుతున్నాయని అన్నారు. చాలా రోజులుగా అతని ఆహారంలో విషం కలుపుతున్నారని లాయర్ ఆరోపించారు. అతన్ని తొలుత జైలులోని క్లినిక్‌కు తరలించారని, ఆ తర్వాత నగరంలోని ఆస్పత్రికి మార్చారని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని మరణించిన విషయం తెలిసిందే. నడుస్తున్న బస్సులో రామ్ సింగ్, వినయ్ శర్మలతో పాటు మరో ముగ్గురు వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 16వ తేదీన ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత 13 రోజులకు బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications