హరి అలక: బాలకృష్ణ రాయబారం, ఎన్టీఆర్ దిగొస్తారా?

వచ్చే ఎన్నికలు పార్టీకి అసలైన పరీక్ష అయిన నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించిన చంద్రబాబు రాయబారం కోసం బాలయ్య వద్దకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. హరికృష్ణ వద్దకు బాలయ్యను రాయబారిగా పంపి ఆయనను చల్లబర్చారని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయన అలక వీడితే పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని బాబు భావిస్తున్నారట.
అయితే చంద్రబాబు, బాలయ్యల భేటీ వెనుక రాజకీయ కారణాలు లేవని, హరికృష్ణ అలక గురించి అసలే కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పది రోజుల క్రితం బాలకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబు ఇంటికి మర్యాద పూర్వకంగా వచ్చారని, ఇప్పుడు బాబు కుటుంబ సభ్యులు నందమూరి హీరో ఇంటికి వెళ్లారని చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ అలక తీరేనా?
చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ పైన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్నారని, బాలయ్య కూడా నాలా లోకేష్‌కే మద్దతిస్తున్నందున వారిద్దరు ఆగ్రహంతో ఉన్నారని, అలాంటప్పుడు బాలయ్య రాయబారిగా వెళ్లినా ఎలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. లోకేష్‌కు తండ్రి బాబు సపోర్ట్ పక్కన పెడితే బాలయ్య మద్దతు హరి, జూనియర్‌లకు మరింత ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. అలాంటి బాలయ్య... హరిని అలకపాన్పు దించి.. తద్వారా జూనియర్‌ను మళ్లీ దగ్గరకు చేర్చగలరా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications