జీవన్ రెడ్డికి జాలి చూపులు: టిఆర్ఎస్‌కు 'ఫస్ట్' ఫీవర్!

First candidate fear to TRS!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి ఫస్ట్ క్యాండిడేట్ భయం ఉందట! సాధారణంగా ఎవరికైనా పార్టీ తరఫున టిక్కెట్ ఖరారయిందంటే ఆనందిస్తారు. అదీ 2014 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తుందని భావించే తెరాస టిక్కెట్ అంటే ఇక పట్టలేని ఆనందమే. అయితే 2014 ఎన్నికలకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టిఆర్ఎస్ టిక్కెట్ ఖరారైన జీవన్ రెడ్డికి మాత్రం కొందరు సానుభూతి వ్యక్తపరుస్తున్నారట.

అందుకు ఓ కారణముందంటున్నారు. తెరాస ఎన్నికల్లో సత్తా చాటడం, చాటకపోవడం విషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీ మొదటి అభ్యర్థిగా ప్రకటించబడిన వారు గెలిచిన సందర్భాలు లేవంటున్నారు. అంతేకాదు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందట. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ఆర్మూర్ నియోజకవర్గానికి ఎ.జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు.

గత అనుభవాల నేపథ్యంలో పార్టీ నేతలు ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటిదాకా పార్టీ తొలి అభ్యర్థి ఎవరూ గెలవలేదట. 2004 ఎన్నికల్లో తెరాస తొలి అభ్యర్థిగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన రేగులపాటి పాపారావు (సిరిసిల్ల) పేరును కెసిఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పాపారావు ఓడిపోయారు. ఇప్పుడాయన పేరు ఎక్కడా వినిపించడంలేదు. 2009 ఎన్నికల్లో తొలి అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించిన సత్యనారాయణ రెడ్డి కూడా పెద్దపల్లిలో ఓడిపోయారు.

అంతేకాదు.. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తూ, మొన్నటిదాకా ఇన్‌చార్జిగా కూడా పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని పెద్దపల్లి ఇన్‌చార్జి పదవి నుంచి కూడా తొలగించారు. ఆయన స్థానంలో మనోహర్ రెడ్డిని ఈ మధ్యనే కెసిఆర్ నియమించారు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో ఆర్మూర్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. దీంతో జీవన్‌ రెడ్డిపై సహచరులు జాలి చూపుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+