జూన్ 7న హాజరు కావాలి: జగన్‌కు పిటీ వారెంట్ జారీ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పిటీ వారెంట్ జారీ అయింది. జూన్ 7వ తేదిన కోర్టులో హాజరు కావాలని నాంపల్లి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు వారెంటును జారీ చేసింది. వచ్చే నెల 7న ఉదయం పదిన్నర గంటలకు జగన్‌ను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

ఇతర నిందితులకు కూడా అదే రోజు హాజరు కావాలని సమన్లు జారీ చేయాలని కోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన కాపీలను సిబిఐకి కోర్టు ఇచ్చింది. రెండు రోజుల్లో నిందితులకు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. జగన్ మినహా మిగతా నిందితులకు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. సిబిఐ అధికారులు కాసేపట్లో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు పిటి వారెంట్ అందించనున్నారు.

కాగా, అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి గతేడాది మే 27వ తేదిన అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన ఆస్తుల కేసును సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ నాలుగు ఛార్జీషీట్లను దాఖలు చేసింది. మరికొన్నింటిని దాఖలు చేసేందుకు సిద్దంగా ఉంది.

హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మరో మంత్రి ధర్మాన ప్రసాద రావులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. వైయస్ జగన్ పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా చుక్కెదురయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+