దావూద్ పనే: 12మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్, పాక్ నుండి ఫోన్స్?

అరెస్టైన బూకీలు, క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ రాకెట్ గుట్టు విప్పినట్లుగా తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం ఈ రాకెట్ సూత్రధారి అని చెప్పారని తెలుస్తోంది. దుబాయ్, కరాచీలతో సంబంధాలు ఈ ఫిక్సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దావుద్ ముఠా పనేనని అజిత్ చండీలా విచారణలో పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.
బిసిసిఐ ఆగ్రహం
స్పాట్ ఫిక్సింగ్ పైన బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫిక్సింగ్‌ను ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపింది. ఆటగాళ్లపై ఆరోపణలు రుజువైతే వారిపై జీవితకాలం నిషేధం విధిస్తామని బిసిసిఐ ఈ సందర్భంగా తెలిపింది. మ్యాచ్ కేసు వ్యవహారాన్ని బిసిసిఐ క్రమశిక్షణా సంఘానికి అప్పగించింది.
మరోవైపు ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో ఈ సాయంత్రంలోగా తేలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications