క్రికెట్ బుక్కీల్లో శ్రీశాంత్ కజిన్: దావూద్ అనుచరుడు

జిజూ జనార్దన్ శ్రీశాంత్‌కు, బుక్కీలకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఓ ఓవరు ఫిక్సింగ్‌కు శ్రీశాంత్‌కు 40 లక్షల రూపాయలు ముట్టినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు 30 కాల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.
మొత్తం 12 మ్యాచులు ఫిక్స్ అయినట్లు పోలీసులు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. దావూద్ కంపెనీ పాత్ర ఫిక్సింగ్‌లో ఉందనే ప్రచారం సాగుతోంది. ఫోన్లను ట్యాప్ చేసి క్రికెటర్లకు, బుకీలకు మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా ముగ్గురు క్రికెటర్లను పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్లు పోలీసులు తెలిపారు. శ్రీశాంత్, అంకిత్, చండిల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ జరిగిన మ్యాచుల వివరాలను, ఓవర్లను ఢిల్లీ పోలీసులు వీడియో ఫుటేజ్ ద్వారా మీడియా ప్రతినిధులకు వివరించారు.












Click it and Unblock the Notifications