శ్రీశాంత్: ఉద్వేగ చర్యలతో వివాదాలు ఇలా..

Sreesanth controversial and emotional
ముంబై‌: నిజానికి ఎస్ శ్రీశాంత్ ప్రస్తుత క్రికెట్ క్రీడాకారుల్లో అత్యంత ఆకర్షణీయమైనవాడు. అంటే కలర్‌ఫుల్ ప్లేయర్‌గా చెప్పవచ్చు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అతను గురువారం అరెస్టయ్యాడు. శ్రీశాంత్ అత్యంత ఉద్వేగభరితుడని కూడా పేరుంది. అలాగే, వివాదాలకు కూడా అతను కేంద్ర బిందువుగా మారుతూ వచ్చాడు. మంచి డ్యాన్సర్‌గా అతని పేరుంది.

శ్రీశాంత్ 2005 - 06 చాలెంజర్ ట్రోఫీ సందర్బంగా మొదటి సారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. సచిన్ టెండూల్కర్‌ను బీట్ చేసిన శ్రీశాంత్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. టెండూల్కర్ వద్దకు వెళ్లి అతని వైపు గుడ్లురిమి చూశాడు. ఆ తర్వాత శ్రీశాంత్ వేసిన బంతిని టండూల్కర్ సిక్స్‌గా మలిచాడు.

2006 డిసెంబర్‌లో హసీం ఆమ్లాను అవుట్ చేసిన తర్వాత వ్యవహరించిన తీరుకు శ్రీశాంత్ ఫీజులో 30 శాతం కోత పడింది. గౌరవభంగం కలిగించినందుకు ఆ శిక్ష పడింది. జోహెనెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా అది జరిగింది.

2007లో ఇంగ్లాండు పర్యటన సందర్భంగా ట్రెంట్ బ్రిడ్జిలో నిబంధనలను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్ ఫీజులో సగం కోత పడింది. ఇంగ్లాండు క్రికెట్ కెప్టెన్ మైకెల్ వాన్‌ భుజాన్ని తన భుజంతో కావాలని అతను తాకాడు. అదే మ్యాచులో కెవిన్ పీటర్సన్‌ తలకు గురి పెట్టి శ్రీశాంత్ బీమర్ వేశాడు. దాంతో అతనిపై తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. శ్రీశాంత్‌ను నిషేధించాలని మైక్ ఆథర్డన్ వ్యాఖ్యానించాడు.

ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా ఇండియాకు, భారత్‌కు మధ్య దర్బన్‌లో జరిగిన మ్యాచులో శ్రీశాంత్ 207 సెప్టెంబర్ 22వ తేదీన అఫీల్ చేసిన పద్ధతికి శ్రీశాంత్ ఫీజులో 25 శాతం కోత పడింది.

2007లో ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా శ్రీశాంత్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. ఆండ్ర్యూ సైమండ్స్‌తో వాగ్వివాదం పెద్ద దుమారం రేపింది. మొహాలీలో నాలుగో వన్డే సందర్భంగా 12వ ఆటగాడిగా ఉన్న శ్రీశాంత్ మైదానంలోకి డ్రింక్స్ పట్టుకుని పరుగెత్తుకొచ్చి ఆండ్ర్యూ సైమండ్స్‌ను దుర్భాషలాడాడు. ఈ సమయంలోనే హర్భజన్, శ్రీశాంత్‌లను సైమండ్స్ తప్పు పట్టాడు.

2008 ఏప్రిల్ 28వ తేదీన జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. శ్రీశాంత్‌ చెంపపై హర్భజన్ సింగ్ ఒక్కటిచ్చుకున్నాడు. మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. పంజాబ్ విజయం సాధించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. శ్రీశాంత్ ఏడుస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

2009లో బిసిసిఐ శ్రీశాంత్‌కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే దేశవాళీ క్రికెట్ నుంచి బహిష్కరిస్తామని బిసిసిఐ హెచ్చరించింది. ముంబై ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణి పట్ల వ్యవహరించిన తీరుకు బిసిసిఐ ఈ హెచ్చరికలు చేసింది. శ్రీశాంత్ ఫీజులో 60 శాతం కోత పెట్టింది.

ఐపియల్ మూడో సీజన్‌లో క్రమశిక్షణకు సంబంధించి శ్రీశాంత్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, మైకెల్ లుంబ్ ఫోర్ బాదినప్పుడు శ్రీశాంత్ వ్యవహరించిన తీరు శిక్షకు కారణమైంది. అతని ఫీజులో 20 శాతం కోత పడింది.

చివరగా, హర్భజన్ చెంపపెట్టుపై ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసి మరో దుమారానికి శ్రీశాంత్ కారణమయ్యాడు. ప్రస్తుత ఐపియల్ సీజన్ సందర్భంగా ఆ పనికి ఒడిగట్టాడు. హర్భజన్ తీరుపై అతను తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరకు స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి అరెస్టయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+