• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెంపదెబ్బ టు ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే (ఫోటోలు)

By Srinivas
|

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ను ప్రతి ఏటా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐపిఎల్ 1 నుండి మొదలు ఐపిఎల్ 6 వరకు ప్రతి యేడా ఏదో ఒక వివాదం చెలరేగింది. ఓ ఆటగాడు మరో ఆటగాడి చెంప చెల్లుమనిపించిన దగ్గర నుండి నిన్నటి ఫిక్సింగ్ వ్యవహారం వరకు ఐపిఎల్ మొత్తం వివాదాలమయంగా మారిపోయింది. ఆయా ఏడాది ఐపిఎల్ వివాదాలు ఇలా ఉన్నాయి....

ఐపిఎల్ 1 (2008)

ముంబయి ఇండియన్స్‌కు చెందిన హర్భజన్ సింగ్ 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు ఎస్ శ్రీశాంత్ చెంప పైన కొట్టాడు. బిసిసిఐ హర్భజన్‌కు 11 మ్యాచుల నిషేధం విధించింది. ఐపిఎల్ 6 సమయంలో శ్రీశాంత్ ఆ ఘటనను గుర్తు చేయడం పలువురు ఖండించారు.

ఐపిఎల్ 2 (2009)

సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్ 2 మ్యాచులు దక్షిణాఫ్రికాకు తరలించబడ్డాయి. అక్కడ నిర్వహించిన ఐపిఎల్‌లో విదేశీ మారకద్రవ్యం ఉల్లంఘనల ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాఫ్తు జరిపిన ఈడి.. ఏడాది తర్వాత ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమానిని సెక్యూరిటీ గార్డులు చితకబాదారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే కారణంతో కొట్టారు. కోల్‌కతా నైట్ రైడర్స్ సారథ్యం విషయంలో గందరగోళం చెలరేగింది.

ఐపిఎల్ 3 (2010)

నిధుల దుర్వినియోగం కారణంగా లలిత్ మోడీని తొలగిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు విషయంలో కేంద్ర సహాయమంత్రి శశిథరూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనలో ఆయన గర్ల్ ఫ్రెండ్ సునంద పుష్కర్ వ్యవహారం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.

ఐపిఎల్ 4 (2011)

వివిధ ఐపిఎల్ జట్ల ఫ్రాంచైజీలతో అనైతిక లావాదేవీలు జరపిరాన్న ఆరోపణలతో మనీష్ పాండేకు నాలుగు మ్యాచుల నిషేధం. ఫ్రాంఛైజీ ఫీజు కట్టలేదని కొచ్చి టీంను ఐపిఎల్ నుండి తొలగించారు.

ఐపిఎల్ 5 (2012)

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై టిపి సుధీంద్ర మీద జీవితకాలం నిషేధం విధించారు. శలబ్ శ్రీవాస్తవ పైన ఐదేళ్లు, మనిష్ మిశ్రా, అమిత్ యాదవ్, అభినవ్ బాలీలపై ఏడాది వేటు వేటు వేశారు. బిసిసిఐకి ఫ్రాంచైజీ రుసుం చెల్లించనందుకు దక్కన్ ఛార్జర్స్ రద్దు. ఎన్నారై మహిళను వేధించాడనే ఆరోపణలతో ల్యూక్ పోమర్సబ్ అరెస్టయ్యాడు. పుణే ఆటగాళ్లు రాహుల్ శర్మ, వేన్ పార్నెల్‌లు రేవ్ పార్టీలో పట్టుబడ్డారు.

ఐపిఎల్ 6 (2013)

స్పాట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలాలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

భజ్జీ కొట్టడంతో ఏడుస్తున్న శ్రీశాంత్(2008)

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

విదేశీ మారక ద్రవ్యం ఉల్లంఘనల ఆరోపణలతో లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చాయి(2009)

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

కొచ్చి జట్టు విషయంలో శశి థరూర్ రాజీనామా చేశారు.(2010)

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

ఫ్రాంచైజీ ఫీజు కట్టలేదని కొచ్చి జట్టును రద్దు చేశారు.(2011)

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

దక్కన్ ఛార్జర్స్ రద్దయింది.(2012)

చెంపదెబ్బ టు స్పాట్ ఫిక్సింగ్: ఆది నుండి వివాదాలే... (ఫోటోలు)

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్‌ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు అరెస్టయ్యారు.(2013)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whether it's the infamous 'Slap-Gate' or Lalit Modi's suspension, the Indian Premier League has been dogged by controversies since its inception in 2008. The cash-rich league has an uncanny ability to remain in news for reasons which has no relation to cricketing activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more