కిరణ్ రెడ్డి తిరుగుముఖం: కాంగ్రెసు నేతల్లో టెన్షన్

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు. ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలతో తీరిక లేకుండా చర్చలు జరిపిన కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడలేదు. అధిష్టానం ఆయనకు ఏం సూచనలు చేసింది, కళంకిత మంత్రులపై కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారా, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందా వంటి పలు సందేహాలకు సమాధానం లేదు. దీంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకుల్లో టెన్షన్ చోటు చేసుకుంది.

ఢిల్లీలో ఆయన శనివారం ఉదయం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, ఇతర నేతలు దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరాలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఇది వరకే భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ఆజాద్‌తో ఐదుసార్లు సమావేశమయ్యారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను తొలగిస్తారా అనేది సందేహంగా మారింది. అయితే, కళంకిత మంత్రులపై చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాఖను మారుస్తారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

కళంకిత మంత్రులను తొలగిస్తే ప్రభుత్వం కూడా తప్పు చేసినట్లు అంగీకరించినట్లవుతుందని, అందువల్ల చర్యలు తీసుకోకపోవడమే మంచిదని కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం పెద్దలతో వాదించినట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ అరెస్టయిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి పేర్లను సిబిఐ చార్జిషీట్లలో నిందితులుగా చేర్చింది. మిగతా ముగ్గురు మంత్రులు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి నిలబడినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించవచ్చునని అంటున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత తీసుకునే చర్యలేమిటనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+