చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో అభివృద్ధికి వైయస్ రాజశేఖర రెడ్డి మారుపేరు అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు, ఫిక్సింగ్‌లకరు మారుపేరు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు మాట్లాడడం వెనక ఆంతర్యమేమిటని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.
ఆరోపణలను ఎదుర్కుంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలనే ఆకస్మిక డిమాండ్ చంద్రబాబు నుంచి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు అధిష్టానం దర్శకత్వంలో చందర్బాబు కథ నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఇదంతా తాము ఆధారాలతోనే చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు స్పష్టంగా బయటపడిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కాంగ్రెసులో కలుస్తామని చంద్రబాబు నేరుగా అంగీకరించవచ్చు కదా అని ఆయన అన్నారు. ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం, కాంగ్రెసు కుమ్మక్కు కావడం వాస్తవం కాదా అని ఆయన అడిగారు. లోక కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తా చంద్రబాబు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు శనివారంనాడు తిరుపతిలో అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైయస్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో దాచుకుందని ఆయన అన్నారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కార్యకర్తలు కసిగా పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కయి ఒక వ్యక్తిపై కుట్రలు చేయడం దారుణమని ఆయన అన్నారు. జగన్ తరఫున ప్రజలే ఉద్యమిస్తున్నారని, త్వరలోని జగన్ ప్రజల ముందుకు వస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications