అంబరీష్‌కు బెర్త్: నటి ఉమాశ్రీకి చోటు, 10 కొత్తముఖాలు

Ambareesh and Siddaramaiah
బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గంలో రెబెల్ స్టార్ అంబరీష్‌కు చోటు లభించింది. శనివారంనాడు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నట్లే. మంత్రివర్గంలో పాతవారితో పాటు కొత్తవారికి కూడా చోటు లభించింది. పది మంది కొత్తవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భరద్వాజ్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆర్‌వి దేశ్‌పాండే, అంబరీష్, కృష్ణ బైర్ గౌడ వంటి సీనియర్లకు సిద్ధరామయ్య తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి మాత్రమే చేరారు. నటి ఉమాశ్రీకి మంత్రివర్గంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో చోటు కల్పించారు. డికె శివకుమార్‌కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రమణ స్వీకారం చేసినవారిలో 20 మంది క్యాబినెట్ మంత్రులు కాగా మిగతా పది సహాయ మంత్రులు.

సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేరినవారు వీరే..

రామలింగారెడ్డి, ఆర్‌వి దేశ్‌పాండే, ప్రకాష్ హుక్కేరి చిక్కోడి, సామనూరు శివశంకరప్ప, ఏకె పాటిల్, జయచంద్ర, ఖమరూల్ ఇస్లాం, రామనాథ్ రాయ్, మహదేవప్ప, అంబరీష్, బాబూరావు, కెజె జార్జ్, హెచ్ ఆంజనేయ, యాటీ కదీర్, ఎంబి పాటిల్, తంగడదడి, దినేష్ గుండూరావు, ఆభిరాయ్ గౌడ, అభయ్ చంద్ర జైన్, రత్నాకర్, ఉమాశ్రీ, సంతోష్ , సతీష్ జరకిహోళి, పరమేశ్వర్ నాయక్, వినయ్ కుమార్, వి. శ్రీనివాస ప్రసాద్, శరన్ ప్రకాష్ పాటిల్య

సిద్ధరామయ్య ఈ నెల 13వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పుపై చర్చించడానికి సిద్ధరామయ్య ఈ వారాంభంలో ఢిల్లీ వెళ్లారు. స్థిరమైన, సమర్థమైన ప్రభుత్వాన్ని అందిస్తానని సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+