వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటు!: అధిష్టానంపై ధర్మాన అలక, అనుచరుల ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్/శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాద రావును తొలగిస్తారనే ప్రచారం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని కాంగ్రెసు పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ధర్మాన కూడా ఈ వ్యవహారంపై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఆయన హుటాహుటినా ఆదివారం హైదరాబాదుకు బయలుదేరారు. సోమవారం ముఖ్యమంత్రితో ధర్మాన భేటీ కానున్నారు.

ఆయనతో భేటీ అయిన తర్వాత ఆయన తన భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రోజు ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. ధర్మానపై వేటు పడుతుందనే ప్రచారం నేపథ్యంలో ధర్మాన అనుచరులు శ్రీకాకుళం జిల్లాలో రహస్యంగా భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెసు పార్టీకి మద్దతుగా నిలిచిన ధర్మానకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మాన కూడా తన వర్గంతో శనివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక నిర్ణయించుకుందామని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీ మోహన్, కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు ధర్మానకు అండగా నిలబడినట్లుగా తెలుస్తోంది.

కాగా, అధిష్టానం వేటు నిజమే అయితే... కళంకిత మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం వస్తే ఆయన రాజీనామా చేసి... 21వ తేదిన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి భేటీ అయ్యారు.

English summary
Minister Dharmana Prasad Rao is unhappy with congress Party High Commands decision on tainted ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X