వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుకీలపై చేతులెత్తేసిన బిసిసిఐ: చర్యలపై నిర్ణయం లేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

N Srinivasan
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో బిసిసిఐ వర్కింగ్ కమిటీ ఆదివారం చెన్నైలో అత్యవసరంగా సమావేశం అయింది. అనంతరం బిసిసి అధ్యక్షుడు శ్రీనివాసన్ విలేకరులతో మాట్లాడారు. బుకీలను కంట్రోల్ చేయలేమని ఆయన చెప్పారు. బుకీలను అదుపు చేయడంలో తాము నిస్సహాయులమన్నారు. స్పాట్ ఫిక్సర్ల పైన చర్యలు తీసుకోవాలని తాము సంబంధింత ఫ్రాంచైజీని ఆదేశించినట్లు చెప్పారు.

స్పాట్ ఫిక్సింగ్ విషయమై ఐసిసి అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతోందన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆధారాలు తమకివ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు చెప్పారు. దీనిపై అంతర్గతంగా విచారిస్తామని, విచారణాధికారిగా సవాని నియమించినట్లు చెప్పారు.

క్రికెటర్లకు, ఏజెంట్లకు తమ గుర్తింపు తప్పని సరి అన్నారు. బుకీలపై తమకు ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. అరెస్టైన ముగ్గురు ఆటగాళ్లపై కేసు పెట్టాలని రాజస్థాన్ రాయల్స్‌కు ఆదేశించినట్లు చెప్పారు. కాగా, ముగ్గురు క్రికెటర్ల పైన జీవిత కాలం నిషేధంపై బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు ఫిక్సింగ్ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా బుకీల పైన దాడులు చేస్తున్నారు. క్రికెటర్లు బస చేసిన హోటళ్లకు సిసి టివి ఫుటేజ్‌లను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ముగ్గురు క్రికెటర్లపై రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

English summary
BCCI on Sunday launched an internal probe into spot-fixing allegations against three Rajasthan Royals players. Ravi Sawani has been appointed as the commissioner of the investigation. The BCCI also decided that all players' agents need to be registered with the Indian board and accredited by them from now on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X