యుపిఏ అజెండాలో తెలంగాణ లేదు!: పిసి చాకో ఝలక్

యూపిఏ రూపొందించిన జాతీయ అజెండా గురించి, అందులో ఇప్పటిదాకా ఏమేం అమలు చేశాం, ఇంకా ఏవి అమలు చేయాల్సి ఉందనేది మాత్రమే తాను చెబుతున్నానని అన్నారు. తనకు తెలిసి... ఈ జాతీయ అజెండాలో తెలంగాణ అంశం లేదన్నారు. అయితే, చాకోనే ఐదు నెలల క్రితం.. మాట్లాడుతూ.. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలమని, దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.
కళంకిత మంత్రులు స్వచ్చంధంగా తప్పుకోవాలి
కళంకిత మంత్రులు స్వచ్చంధంగా తప్పుకోవాలని చాకో అన్నారు. కేంద్రంలోని మంత్రులు మాదిరిగా రాష్ట్రంలోని మంత్రులు కూడా రాజీనామాలు చేయాలని చాకో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశం యుపిఏ అజెండాలో లేదని చాకో పేర్కొన్నారు.
ప్రధానిని మార్చం
వచ్చే ఎన్నికల వరకు ప్రధానిని మార్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే యూపీఏ-3 అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇప్పుడు బలమైన ప్రధాని ఉన్నాడనీ, అందువల్ల ప్రధానిని మార్చే ఉద్దేశం లేదనీ తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ తిరిగి విజయం సాధిస్తే ప్రదాని ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన.. ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయనీ, అయినా ప్రధాని ఎంపిక విషయం తమ పరిధిలో లేని అంశమన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications